లేగదూడ మృతి చెందిన స్థలంను పరిశీలించిన ఎఫ్ఆర్వో

తానూర్ మండలం బెంబర్ శివారులో చిరుత దాడి చేసి లేగదూడను చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు సాయినాథ్ సమాచారంతో ఎఫ్ఆర్వో శంకర్ ఘటనాస్థలాన్ని పర్యవేక్షించి, మృతిచెందిన లేగదూడను పరిశీలించారు. రైతుకు ధైర్యం చెప్పి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను బంధించేందుకు వెంటనే బోను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕