నిర్మల్ జిల్లా సోన్ మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సరస్వతి కాల్వ సమీపంలోని కాల్వ పక్కన రోడ్డు వద్ద వ్యక్తి మృతదేహం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు మంగళవారం సమాచారం అందించారు. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని, మతిస్థిమితం లేని వ్యక్తి అని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ గోపి తెలిపారు.