నిర్మల్ జిల్లాలో మెటజోలం అనే మత్తు ఇంజెక్షన్ ను అమ్ముతున్న నలుగురిని గురువారం అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఆసుపత్రుల్లో అనస్థీషియాకు వాడే ఇంజెక్షన్ ను కొందరు బయట అమ్ముతుండగా ఏఎస్పీ రాజేశ్ మీనా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది రికార్డులు పక్కాగా ఉండేలా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. యువత మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.