నిర్మల్ లోని మోహన్ ఎలక్ట్రానిక్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని పట్టణ పోలీసులు తక్షణమే ఛేదించి దొంగిలించిన వస్తువులను జప్తు చేశారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడానికి గుర్తించిన షాప్ యజమాని తన తరఫున ఆడిట్ నిర్వహించి అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై యజమాని వెంకటరమణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.