నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అల్లంపల్లి పంచాయతీకి చెందిన ఉయికే భీము (19), కొమ్రా రాంబాయి (45) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.