నిర్మల్: కారు బావిలో పడి యువకుడి దుర్మరణం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బావిలో పడటంతో శ్రీనివాస్ (38) అనే యువకుడు మృతి చెందాడు. అత్యవసర పనిమీద రంగపేట్ వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొమ్ముతండా సమీపంలో రహదారి పక్కనే ఉన్న బావిలో కారు దూసుకెళ్లింది. మృతుడు కడం మండలంలోని 'మన్ గ్రోమోర్' సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్