ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బాలుడిని కాపాడిన పోలీసులు

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే బాలుడు ఇంట్లో గొడవల కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు జిల్లా కేంద్రంలోని కంచరోని చెరువులోకి దూకాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, జాలర్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి బాలుడిని అప్పగించారు. ఈ ఘటనపై ఎస్పీ జానకి షర్మిల పోలీస్ సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్