సారంగాపూర్: ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్య

ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సారంగాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వంజర గ్రామానికి చెందిన పోశెట్టి (65) 20 ఏళ్లుగా హనుమాన్ దేవాలయంలో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్