బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శిగా షేక్ అల్తాఫ్

తానూర్ మండలం కొలూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు షేక్ అల్తాఫ్ బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా సెక్రెటరిగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వ పటిమ, నిరంతర ప్రజాసేవను గుర్తించి పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ, "నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు, మైనార్టీల సంక్షేమం, బీజేపీ బలోపేతమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తాను" అని ఉత్సాహంగా ప్రకటించారు. ఆయన నియామకంతో మండలంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕