నిర్మల్ జిల్లా భైంసా పోలీసు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల బుధవారం ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని పోలీస్ శాఖ తెలిపింది. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు ఉన్న ప్రజలు ఆధారాలతో నేరుగా కలిసి విన్నవించుకోవచ్చని, అందిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.