ఈదురుగాలులు.. రాళ్ల వాన..!

నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భారీ శబ్దంతో ఈదురుగాలులు వీచి, సుమారు అరగంట పాటు గాలివానతో పాటు వడగండ్లు కురిశాయి. ఈ ప్రకృతి వైపరీత్యంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉరుములు, మెరుపుల ధాటికి పట్టణమంతా అల్లకల్లోలమైంది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బీభత్సంగా మారడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.

సంబంధిత పోస్ట్