కొరిటికల్లో గస్తీ నిర్వహిస్తున్న వీడిసి సభ్యులు

మామడ మండలంలోని కోరిటికల్ గ్రామంలో వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ పగలగొట్టిన దుండగులు తర్వాతి రెండు రోజుల్లో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైక్ను దొంగలించారు. అప్రమత్తమైన వీడిసి రాత్రి 10: 00 నుండి ఉదయం నాలుగు గంటల వరకు గస్తీ కాస్తున్నారు. అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులను పట్టుకొని ప్రశ్నించడంతోపాటు పోలీసులకు సమాచారంఅందిస్తున్నారు. గ్రామంలో గస్తీ కాస్తున్న పీడీసీ సభ్యులను గ్రామస్తులు అభినందించడంతో పాటు ధైర్యంగా ఉన్నామని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్