నెరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ మామడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఓ లారీ రాంగ్ రూట్‌లో రివర్స్ తీస్తుండగా, అదే రాంగ్ రూట్‌లో బైక్‌పై వస్తున్న మడావి భీమ్రావు లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భీమ్రావు ఛాతికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తక్షణమే నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.