కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గురువారం జరిగిన ఘటనలో ఒక యువకుడు చెనుకు వెళ్లి తిరిగి వస్తుండగా వాగులోకి జారిపడి గల్లంతు అయినట్టు సమాచారం. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో వాగులు దాటి వెళ్లడం ప్రమాదకరం. ప్రస్తుతం యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.