కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడు సయ్యద్ అజహర్ (27)కు ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. 2020 అక్టోబర్ 23న ఫిర్యాదుదారు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, ప్రేమ పేరుతో యువతిని వేధించినట్లు ఆరోపణలున్నాయి. సీసీటీవీల్లో నమోదైన ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో తాజాగా శిక్ష ఖరారైంది.