ఆసిఫాబాద్: వడదెబ్బతో వివాహిత మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం అంబగట్టకు చెందిన బండి విమల వడదెబ్బతో మృతిచెందారు. ఈనెల 10న తునికాకు సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. గురువారం గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కొడుకు కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్ట్ మార్టం చేయించారు. ఎండదెబ్బతో మరణించిందని డాక్టర్లు తెలిపినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్