ఆసిఫాబాద్: యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గండాలయపేట గ్రామానికి చెందిన చప్లే చందు ఓ యువతిపై 2022లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి బయట బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సీఐ రమేశ్ తెలిపారు. ఈ మేరకు చందుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా గురువారం జిల్లా జడ్జి ఎంవీ రమేశ్ నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 40వేల జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్