కాగజ్‌నగర్ సమీపంలోని పెద్దవాగు టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అటు వైపుగా వెళ్ళే ప్రయాణికులు క్షతగాత్రులను కాపాడి 108 కు సమాచారం అందించారు. ఘడనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వాహనములో కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.