బెజ్జార్ రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. కృష్ణపల్లి వాగు ఒడ్డున తాజా పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులకు డప్పు చాటింపు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఒంటరిగా బయటికెళ్లకుండా, వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లి సాయంత్రం 4 గంటలకల్లా ఇళ్లకు చేరాలని సూచించారు. పశువులతో అటవీ అంచులకు వెళ్లకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.