కాగజ్‌నగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కాగజ్‌నగర్ పట్టణంలోని మోసం గ్రామ శివారులో ఉన్న బండల ఒర్రెలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, ఆష్ కలర్ షార్ట్ ధరించి ఉండగా, మెడలో నలుపు దారం, చేతికి కడియం, ఎరుపు, పసుపు దారాలు ఉన్నాయి. సంబంధిత వివరాలు తెలిసిన వారు సమీప పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్