కాగజ్‌నగర్ పట్టణంలోని 17వ వార్డులో స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పనులను నాణ్యతతో, గడువులోపు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్ ఎమ్మాజీ శారద పాల్గొన్నారు.