చింతలమానేపల్లి మండలంలోని గురువారం దీందా గ్రామం వరదలతో పూర్తిగా జలదిగ్బంధమైంది. గ్రామం పక్కనే ఉన్న లోలెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు తెలియజేసినా గిరిజన గ్రామాల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.