కాగజనగర్: ఈ గుంతను పూడ్చరా..?

కాగజనగర్ లోని వార్డ్ నెం 20 సుభాష్ కాలనీలో నల్ల కనెక్షన్ కోసం గుంతను తవ్వి నెల రోజులు గదచిపోయాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ గుంతను పూడ్చటం మరిచారు. దీంతో ఈ గుంత ప్రమాదకరంగా మారిందని‌ కాలనీవాసులు అంటున్నారు. కాలనీలో చిన్నపిల్లలు ఉన్నారని, అందులో పడితే బాద్యులు ఎవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ గుంతను పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్