కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఎరువుల దుకాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రాయితీ ఎరువులను పూర్తి ధరకు అమ్ముతున్నారని, బిల్లుల్లో తప్పుడు ధరలు నమోదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖలు సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై ఫెర్టిలైజర్ వ్యాపారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉందని జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోట్పెళ్లి జైరామ్ అన్నారు.