కాగజ్నగర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 2 సర్ సిల్క్ గంగారం బస్తిలోని ఓ ఇంటిలో గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీవాసులు వేంటనే మాజీ కౌన్సిలర్ బల్క శ్యామ్ కు కాల్ చేయడం జరిగింది. అతను తక్షణమే స్పందించి ఫైర్ స్టేషన్ కు కాల్ చేసి సిబ్బందితో వచ్చి అగ్ని ప్రమాదాన్ని అడ్డుకోవడం జరిగింది. దీనిపై బాల్క శ్యామ్ కు, అగ్నిమాపక సిబ్బందికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.