బెజ్జూర్ అడవీలో నిప్పు

బెజ్జూర్ మండలం అంబగుట్ట గ్రామ సమీపంలోని మంగళవారం రాత్రి అటవీ ప్రాంతంలో నిప్పు రాజుకుంది. అడవిలో నిప్పు అంటుకొని మంటలు చెలరేగడంతో జీవరాసులకు, వన్యప్రాణులకు ప్రాణహాని జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా సార్లు నిప్పు అంటుకుంది. ప్రజలు మంటలు పెడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్