సిర్పూర్: కుక్కల దాడిలో ఐదేళ్ల పాపకు తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలైన ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన అవంతిక (5)పై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్