కాగజ్‌నగర్ కాపువాడలో వరద ముప్పు

కాగజ్నగర్ కాపువాడలో వరద నీటి ప్రవాహంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు సమీప పంట పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంటలకు నష్టం వాటిల్లడమే కాక, పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగి, వ్యాధులు ప్రబలే పరిస్థితి ఏర్పడిందని బట్టుపల్లి గ్రామ ప్రజలు గురువారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్