పెద్దబండ రైల్వే బ్రిడ్జ్ వద్ద పెద్దపులి సంచారం.. వీడియో

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి భీమన్న సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై బుధవారం రాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. కాగజ్‌నగర్‌ నుండి సిర్పూర్ కు కారులో వెళుతున్న ప్రయాణికులు చిరుతపులిని చూసి భయపడ్డారు. వాహనదారులు తమ సెల్ కెమెరాల్లో బంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రయాణికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్