కాగజ్‌నగర్లోని రాజీవ్ గాంధీ చౌరస్తాలోని ఓ హోటల్ లో ఆదివారం వెజ్ బిర్యాని ఆర్డర్ చేసిన ఇద్దరు యువకులకు బిర్యానిలో చికెన్ బొక్కలు రావడంతో ఆశ్చర్యపోయారు. ఇదేంటని వేయిటర్ ను, యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ హోటల్ లలో ప్యూర్ వెజ్ బిర్యాని ఎక్కడ దొరుకుతుందంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో యువకులు గట్టిగా ప్రశ్నించగా వాళ్ళు అక్కడి నుండి జారుకున్నారని, సదరు హోటల్పై చర్యలు తీసుకోవాలని కోరారు.