కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని అటవిప్రాంతంలో పులి కళేబరాన్ని గుర్తించినట్లు ఎఫ్డీపీటీ శాంతారాం, ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళేబరాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకొని శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపించామన్నారు. రిజల్ట్స్ వచ్చాక పెద్దపులా, చిరుతా అనేది వెల్లడిస్తామన్నారు.