ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో హల్ చల్ చేస్తున్న పెద్ద పులి బుధవారం సిర్పూర్ టి. మండలం మకుడి - మహారాష్ట్ర అనుర్ గ్రామ సరిహద్దు ప్రాంతంలో పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ కనిపించింది. దింతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.