భువనగిరిలో జూలై 5న రాజ్యాధికార సమరభేరి సభ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో 'రాజ్యాధికార సమరభేరి' సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పార్టీ స్టేట్ సెక్రెటరీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి, కాగజ్‌నగర్ మండలానికి చెందిన కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను ఆహ్వానించారు. కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్ నుంచి వచ్చిన కొమ్ముల ప్రవీణ్ రాజ్, మందకృష్ణ మాదిగను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికార లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కావాలని మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్