దహేగం మండలం లగ్గామ గ్రామ సమీపంలో శుక్రవారం ఒడ్డుగుడా గ్రామానికి చెందిన వ్యక్తి తన స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ పరిస్థితిని గమనించిన అతను ఎంతో చాకచక్యంగా స్పందించి వెంటనే వాహనాన్ని ఆపి, దూరంగా వెళ్లిపోయాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్కూటీ పూర్తిగా దగ్ధమయినప్పటికీ, వ్యక్తి సురక్షితంగా బయటపడటం ఊపిరిపీల్చుకునే విషయంగా మారింది.