కాగజ్‌నగర్‌: స్కూటీని ఢీకొన్న కారు.. యువతికి స్వల్ప గాయాలు

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్కూటీపై వెళ్తున్న యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతికి స్వల్పగాయాలు కాగా.. స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కారు స్కూటీని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్