సిర్పూర్: పెద్దవాగులో గల్లంతైన మృతదేహం లభ్యం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి పెద్దవాగులో బట్టుపల్లి ( జీడిచెను) గ్రామానికి చెందిన ఎస్పీఎం కాంట్రాక్టర్ ఉద్యోగి మీడుగొండ పోచయ్య(48) బ్రిడ్జ్ మీద నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా గత రెండు రోజులుగా అతని ఆచూకీ కోసం వెతుకగా ఆదివారం కొత్తిమీర సమీపంలోని పెద్దవాగులో మృతదేహం దొరికినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్