కాగజ్‌నగర్‌: టాటా‌మాజిక్, స్కూటీ ఢీ.. ఒకరి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం పర్దన్గూడ గ్రామ సమీపంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్‌ నుండి సిర్పూర్ వైపుకు వెళుతుండగా టాటామ్యాజిక్, స్కూటిని ఢీ కొనడంతో సిర్పూర్ టి మండలం పెద్ద బండ గ్రామానికి చెందిన స్వప్న బిస్వాస్(16)మృతి చెందింది. మరొక యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్