కాగజ్‌నగర్ పట్టణం ఆదర్శనగర్ లోని శ్రీ త్రినేత్ర శివాయంలో మంగళవారం అర్థరాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంలోకి అర్ధరాత్రి చొరబడి గర్భగుడిలోని శివలింగంపైన ఉన్న వెండి నాగపడగను దోచుకెళ్లారు. బుధవారం స్తానికులు గమనించి పూజారికి తెలుపగా పూజారి వచ్చి చూసి తాళం పగిలి ఉందని, వెండి నాగ పడుగ కనిపించలేదని అన్నారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.