బెజ్జూర్ మండలంలోని 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి, సుస్మిర్ గ్రామాల సమీపంలోని రెండు ఓర్రెలు గురువారం ఉదయం నుండి ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల ప్రజలు ఓర్రెలు ఉప్పొంగితే ఎటు వెళ్లలేని పరిస్థితిగా మారుతుందని గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లాలంటే అంతే సంగతి. అధికారుల స్పందించి ఓర్రెలపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్