కాగజ్‌నగర్‌: రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

కాగజ్‌నగర్‌ మండలం వంజిరీ సమీపంలో మంగళవారం జరిగిన బైక్ ఆక్సిడెంట్లో బెజ్జూర్‌ కు చెందిన జావిద్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి మరొక బైక్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడిని వెంటనే కాగజ్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి కుడి కాలు విరిగిందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తున్నామని కుటుంబీకులు చెప్పారు.

సంబంధిత పోస్ట్