కాగజ్ నగర్: ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కాగజ్ నగర్ మండలం గన్నారంకు చెందిన అనుష (20)ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఈస్గాం ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం. ఇదే గ్రామానికి చెందిన సందీప్(22) తో మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాను పెళ్లి చేసుకోనని అనుషతో చెప్పడంతో ప్రేమ విఫలమైందని తెలిసి మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్