టాలీవుడ్ హీరో అడివి శేష్ తన ప్రతిష్టాత్మక చిత్రం 'డెకాయిట్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భావోద్వేగానికి గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీని కోసం తన టీమ్ అహోరాత్రులు కష్టపడిందని ఆయన తెలిపారు. దర్శకుడు షనీల్, సింగర్ జోనిత గాంధీ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, 'గూఢచారి 2' డైరెక్టర్ వినయ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ల కృషిని కొనియాడారు. ఇక ఇంటర్వేల్ లో మృణాల్ కేరక్టర్ పిచ్చెక్కిస్తుంది అని తెలిపారు.