అడివి శేష్ బాలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం

కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా గుర్తింపు పొందిన అడివి శేష్, ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందనున్న హిందీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో కాస్టింగ్ పూర్తి చేసి, అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్