రైతును రాజును చేసేలా పరిపాలన: మంత్రి పొంగులేటి

TG: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో సామాన్య ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేశామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించామని తెలిపారు. రైతును రాజును చేసేలా పరిపాలన చేస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్