నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) 2027-28 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రధాన క్యాంపస్ అహ్మదాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, హరియాణా కేంద్రాల్లోని వివిధ కోర్సుల్లో చేరేందుకు డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్టు (DAT) పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ పరీక్ష ద్వారానే ప్రవేశాలు పొందవచ్చు.