ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే వాట్సప్‌లో ‘యాడ్స్ ఆప్షన్’ను ప్రారంభించినట్లు మెటా ప్రకటించింది. మొదట స్టేటస్ సెక్షన్‌లో, తరువాత చాట్ లిస్టులోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. ఇవి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లా ఉండనున్నాయి. అయితే యూజర్ల గోప్యతను దృష్టిలో పెట్టుకొని, ఈ యాడ్స్ వ్యక్తిగత సందేశాలకు సంబంధం లేకుండా ఉంటాయని మెటా స్పష్టం చేసింది. ప్రస్తుతం నాన్-ఇంట్రూసివ్ యాడ్స్‌ను పరీక్షిస్తున్నట్టు పేర్కొంది.