ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రోడ్డు పక్కన విక్రయించే చౌమీన్, బర్గర్లలో ఉపయోగించే కల్తీ సాస్ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు 200 లీటర్ల కల్తీ సాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. టమోటాలకు బదులుగా ప్రమాదకర రసాయనాలు, యాసిడ్లు, కృత్రిమ రంగులు వాడి ఈ సాస్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత సాస్ వల్ల అల్సర్లు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.