TG: రేషన్ కార్డుదారులకు జూలై నెల కోటా బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా బియ్యాన్ని ఏప్రిల్‌లోనే ఒకేసారి పంపిణీ చేశారు. తాజాగా జూలై నెలకు సంబంధించిన బియ్యం అందించేందుకు గానూ రేషన్‌న్‌దుకాణాల డీలర్లకు బియ్యం సరఫరా ప్రక్రియను ప్రారంభించారు. జూలై 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు.