సెప్టెంబర్‌ 15తో ముగియనున్న అడ్వాన్స్‌ ట్యాక్స్‌ గడువు

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపునకు సెప్టెంబర్‌ 15 చివరి తేదీ. ఏడాదిలో నికర పన్ను బాధ్యత రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. సెప్టెంబర్‌ 15 నాటికి మొత్తం పన్నులో 45 శాతం చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే సెక్షన్‌ 234సీ కింద లోటు మొత్తంపై నెలకు 1 శాతం చొప్పున 3 నెలల పాటు వడ్డీ విధిస్తారు. లాస్ట్‌ డేట్ కావడంతో ఆలస్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕