గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం.. వెలుగులోకి సూసైడ్ నోట్

AP: తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం రోడ్డు కమ్‌ రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకింది. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతుకాగా.. మనవడు రియాన్ష్‌ కార్తికేయను జాలర్లు కాపాడారు. నదిలోకి దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబంపై వేధింపులు, బెదిరింపులు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారని సమాచారం. కాగా, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్